ఈనెల 26 న వర్మ ఖర్మ అంటూ పోస్టర్ లు వెలిసాయి

Published on Dec 14,2019 05:07 PM

ఈనెల 26 న దర్శకులు రాంగోపాల్ వర్మ పెద్ద ఖర్మ అంటూ పోస్టర్ లు వెలిసాయి కోడూరు పాడులో. జనసేన కార్యకర్తలు వర్మ కర్మ అంటూ వినాయిల్ పోస్టర్ లను ఏర్పాటు చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఇంకేముంది ఈ కర్మ పోస్టర్ వర్మ కంట పడింది దాంతో వ్యంగ్యంగా పోస్ట్ చేస్తూ మరింత వివాదానికి ఆజ్యం పోసాడు వర్మ. అవును మీ లీడర్ ని దెయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా అంటూ పోస్ట్ పెట్టాడు వర్మ. అంతేనా నాకు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , లోకేష్ లంటే విపరీతమైన ప్రేమ అంటూ కూడా మరింతగా కెలికాడు ఫ్యాన్స్ ని.

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రం చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నో అవాంతరాలను అధిగమించి డిసెంబర్ 12న విడుదల అయ్యింది. అయితే సినిమాలో చంద్రబాబు , లోకేష్ , పవన్ కళ్యాణ్ , జగన్ , కే ఏ పాల్ లను పోలిన పాత్రలు ఉండటంతో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ సినిమా మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. సినిమాలో పవన్ కళ్యాణ్ ని అవమానిస్తూ సన్నివేశాలను చిత్రీకరించడంతో వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.