శ్రీదేవితో పోల్చి ఈ భామని పడేసాడట వర్మ

Published on Dec 27,2019 04:53 PM
రాంగోపాల్ వర్మకు పైత్యం ఎక్కువయ్యింది కాకపోతే అతిలోకసుందరి శ్రీదేవి ఎక్కడ ? కొత్తగా వచ్చిన హీరోయిన్  అంకిత మహారాన  ఎక్కడ ? ఈ భామని తన బుట్టలో వేసుకోవడానికి ఏకంగా శ్రీదేవితో పోల్చాడట ! ఇంకేముంది అంకిత మహారాన ఆ కాంప్లిమెంట్ నిజమే అనికొని ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. ఈ భామని శ్రీదేవితో ఎందుకు పోల్చాడో ఒక్క వర్మ కు మాత్రమే తెలుసు కానీ ఈ భామకు మాత్రం తెలీదు అందుకే పరవశించి పోతోంది. శ్రీదేవి నటనతో , అందంతో పోల్చడం అంటే వర్మ ఎలాంటి జిత్తులు వేస్తున్నాడో యిట్టె అర్ధం చేసుకోవచ్చు.

ఎలాంటి గ్లామర్ పాత్రలనైనా చేయడానికి సిద్ధం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న అంకిత మహారాన తెలుగులో ఇంతకుముందు 4 లెటర్స్ అనే అడల్ట్ మూవీ లో నటించింది. ఆ సినిమా అంతగా ఆడలేదు , ఇక ఇప్పుడేమో ''ఊల్లాల ఊల్లాల '' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక రాంగోపాల్ వర్మ ఈమె అందానికి ఫిదా అయి తన రెండు సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చాడట దానికి ఉప్పొంగిపోతోంది. తనని శ్రీదేవి వంటి అతిలోక సుందరి తో పోల్చాడంటే బుట్టలో పడేయడానికి అబద్దం చెప్పాడని అర్ధం చేసుకోవాలిగా....... ఇప్పుడు అర్ధం కాదులే !