కిమ్ డైనెస్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ

Published on Apr 26,2020 04:54 PM
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ సోదరి కిమ్ డైనెస్టీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. కిమ్ డైనెస్టీ కిమ్ ని మించిన నియంత అని కథనాలు జోరుగా వస్తున్నాయి. కిమ్ ఆరోగ్యం క్షీణీస్తోందని ఒకవేళ కిమ్ కు ఏమైనా జరిగితే అతడి స్థానంలో అధ్యక్ష పదవికి కిమ్ డైనెస్టీ ఎంపిక అవుతుందని ఒకవేళ అదే నిజమైతే ప్రపంచం ఒక లేడీ విలన్ ని చూస్తుందని సంచలన ట్వీట్ చేసాడు రాంగోపాల్ వర్మ. 

కిమ్ జాంగ్ గతకొద్ది రోజులుగా మీడియా ముందుకు రావడం లేదు. గుండె ఆపరేషన్ జరిగిందని కిమ్ ఆరోగ్యం క్షీణీస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం తల్లకిందులు అవుతున్న నేపథ్యంలో కిమ్ సైలెంట్ గా ఉండటంతో అతడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.