వివాదాస్పదంగా మారిన వర్మ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

Published on Aug 27,2019 03:15 PM

క్యాస్ట్ ఫీలింగ్ తో వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ విడుదల చేసిన పాట వివాదాన్ని రాజేస్తోంది. తాజాగా ఈ దర్శకుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ సాంగ్ ని విడుదల చేసి వివాదాన్ని రాజేసిన వర్మ తాజాగా కులాల ప్రస్తావనతో ఓ పాట విడుదల చేసాడు. 

ఇక ఈ పాటలో కమ్మ కులం అలాగానే చంద్రబాబు నాయుడు , లోకేష్ ల విజువల్స్ వాడుకున్నాడు.  అలాగే కాపు అనగానే పవన్ కళ్యాణ్ , రెడ్లు అనగానే వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , రాజు కులం గురించి ప్రస్తావన రాగానే ప్రభాస్ విజువల్ వాడుకున్నాడు. దాంతో ప్రభాస్ ని ఈ కుల వివాదంలోకి లాగినట్లైంది.