రూమర్లపై స్పందించిన వాణీ విశ్వనాథ్

Published on Nov 28,2019 03:18 PM

సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ తన పై తన కూతురు పై వస్తున్న రూమర్లపై స్పందించింది. నా కూతురు ఇంటర్మీడియేట్ చదువుతోంది , డాక్టర్ కావాలని ఆశపడుతోంది ఒకవేళ ఆమెకు చదువు పై ఆసక్తి తగ్గి సినిమాలు చేస్తాను అని చెబితే అప్పుడు తప్పకుండా నేనే చెబుతాను అంటూ తన కూతురు హీరోయిన్ అవుతోంది అన్న వార్తలను ఖండించింది వాణీ విశ్వనాథ్. 80 - 90 వ దశకంలో తెలుగు , తమిళ , మలయాళ భాషలలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ వాణీ విశ్వనాథ్.

అయితే పెళ్లి చేసుకున్నాక సినిమాలు దూరమై కాపురం చేసుకుంటూ పిల్లల చదువు కోసం కష్టపడింది. కట్ చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈమధ్య వాణీ విశ్వనాథ్ కూతురు హీరోయిన్ గా నటించడానికి సిద్ధం అవుతోంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించింది వాణీ విశ్వనాథ్. అయితే వాణీ విశ్వనాథ్ అక్క కూతురు వర్ష హీరోయిన్ గా నటిస్తోంది , తన కూతురుకు కూడా నటన పై ఆసక్తి కలిగితే తప్పకుండా సినిమాల్లోకి తీసుకొస్తానని అంటోంది వాణీ.