జాకెట్ వివాదంలో వాణీ కపూర్

Published on Nov 22,2019 10:55 PM

బాలీవుడ్ భామ వాణీ కపూర్ జాకెట్ వివాదంలో ఇరుక్కుంది. అసలు  ఈ భామ జాకెట్ వేసుకునేదే తక్కువ అందులో ఇంకా వివాదం కావడానికి కారణం ఏంటో తెలుసా ....... వాణీ కపూర్ వేసుకున్న జాకెట్ పై హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు పేరు ఉండటమే. భారతీయులకు అందునా హిందువులకు ఎంతో ముఖ్యమైన దేవుడి పేరు జాకెట్ మీద ఉండటంతో ఈ వివాదం పెద్దది అవుతోంది.

ఓ వ్యక్తి వాణీ కపూర్ మీద కేసు కూడా పెట్టాడు హిందువుల మనోభావాలు కించపరిచింది అని. ఈ భామ శ్రీరాముడి పేరు ఉన్న జాకెట్ వేసుకోవడమే కాకుండా దానిపై ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టింది. ఇంకేముంది అది వైరల్ అయ్యింది దాంతో వివాదాస్పదం అయ్యింది. తన జాకెట్ వివాదాన్ని రాజేయడంలో వాణీ కపూర్ ఆ ట్వీట్ ని తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరి. అన్నట్లు ఈ భామ తెలుగులో హీరో నాని సరసన '' ఆహా కళ్యాణం '' చిత్రంలో నటించింది.