'నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..' పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న వరుణ్‌తేజ్‌ 'వాల్మీకి' ట్రైలర్‌

Published on Sep 09,2019 05:36 PM
'నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..' 
పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న వరుణ్‌తేజ్‌ 'వాల్మీకి' ట్రైలర్‌ 

'నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..', 
'మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వకపోతే.. ఇగ బతుకుడెందుకురా..' 
'జిందగీ మాదర్‌చోద్‌ తమ్మీ. ఉత్త గీతలే మన చేతులుంటయ్‌, రాతలు మన చేతులుండయ్‌' 
'గవాస్కర్‌ సిక్స్‌ కొట్టుడు, బప్పీలహరి పాట కొట్టుడు, నేను బొక్కలిరగ్గొట్టుడు.. సేమ్‌ టు సేమ్‌.. అదే ప్యాసన్‌' 
...ఇవీ వరుణ్‌తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాల్మీకి' చిత్రంలోని పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగ్స్‌. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే, మ ణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోమవారం విడుదలైన ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రంలో వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ చెప్పే డైలాగ్స్‌కి థియేటర్‌లో విజిల్స్‌, క్లాప్స్‌ ఖాయమని డైలాగ్స్‌ వింటే అర్థమవుతుంది. 
సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: ఐనాంక బోస్‌, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, స్క్రీన్‌ ప్లే: మధు శ్రీనివాస్‌, మిథున్‌ చైతన్య, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌