ఈ భామని కూడా పడకగదికి రమ్మన్నారట !

Published on Mar 15,2020 03:20 PM
నన్ను కూడా బెడ్ రూంలోకి రావాలని , స్వర్గం అందించాలని పలువురు దర్శక నిర్మాతలు కోరారని సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ వాణి భోజన్. హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా చిత్రంలో హీరోయిన్ గా నటించిన భామ ఈ వాణి భోజన్. దర్శకులు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తా చిత్రంలో హీరోయిన్ గా నటించింది వాణి భోజన్. తమిళంలో బాగా ఫేమస్ అయిన ఈ భామ తెలుగులో కూడా బిజీ కావాలని ఆశపడుతోంది.

అయితే కాస్టింగ్ కౌచ్ అనేది హీరోయిన్ లను పట్టి పీడిస్తూనే ఉందని అంటోంది. నన్ను బెడ్ రూంలోకి రమ్మని చాలామందే అడిగారట ! అయితే నేరుగా నన్ను అడగలేదు నా మేనేజర్ కు చెప్పారట ! నాకు సినిమాల్లో నటించాలని ఉంది కానీ ఎవరి బెడ్ ఎక్కాలని లేదని సంచలనం సృష్టించింది. హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజిచ్చే ఈ భామ కుర్రాళ్ళని రెచ్చగొడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హీటెక్కిస్తోంది. అయితే ఇలాంటి వాటికీ మాత్రం ఒప్పుకునే ప్రశ్నే లేదని అంటోంది.