ఉయ్యాలవాడ కుటుంబీకుల లొల్లి ఇంకా అయిపోలేదు

Published on Sep 16,2019 11:50 AM

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం చాలా రోజులుగా వివాదాలతో సహవాసం చేస్తోంది. మా వంశస్తుడి కథతో సినిమా తీస్తున్నారంటే సంతోషించాం , సహకరించాం కానీ మమ్మల్ని ఆదుకుంటామని చెప్పి అవమానిస్తున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులం అంటూ కొంతమంది చాలా రోజులుగా వివాదం చేస్తూనే ఉన్నారు.
రాంచరణ్ వాళ్లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు కానీ మాకు న్యాయం జరగలేదు అంటూ తాజాగా మరోసారి సైరా ఆఫీసు ముందు ధర్నాకు దిగారు ఉయ్యాలవాడ కుటుంబీకులు. దాంతో మరోసారి రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి అవుట్ పోస్ట్ కు తరలించారు. సినిమా విడుదలకు సిద్దమౌతున్న సమయంలో మరోసారి వివాదం రాజుకుంది.