మహేష్ సినిమాని రిజెక్ట్ చేసిన ఉపేంద్ర

Published on Mar 12,2019 04:17 PM

కన్నడ స్టార్ హీరో , తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హీరో , దర్శకుడు ఉపేంద్రకు తెలుగులో మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అయితే ఆ ఛాన్స్ ని మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడట . స్టార్ హీరో సినిమా అందునా కీలకమైన పాత్ర అని సంప్రదించినప్పటికీ తిరస్కరించడానికి కారణం ఏంటో తెలుసా ........ డేట్స్ ఖాళీ లేకపోవడమే ! 

మహేష్ బాబు సినిమాకోసం ఏ డేట్స్ అయితే అడిగారో ఆ డేట్స్ మరొక సినిమాకు ఇచ్చాడట ఉపేంద్ర దాంతో మహేష్ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నాడు అంతేకాదు భవిష్యత్ లో మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని అంటున్నాడు ఏంటో ? ఇప్పుడు వదులుకొని మరోసారి వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని అంటున్నాడు ఉపేంద్ర . అనిల్ రావిపూడి - మహేష్ బాబు ల కాంబినేషన్ లో వచ్చే  సినిమా కోసం ఉపేంద్ర ని అడిగారన్న మాట !