హమ్మయ్య ! ప్రభాస్ ఓ అప్ డేట్ ఇచ్చాడు

Published on Jan 17,2020 04:01 PM

హమ్మయ్య ! ఎట్టకేలకు ప్రభాస్ ఓ అప్ డేట్ ఇచ్చాడు ఇన్నాళ్లకు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తాజాగా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ ని వర్కింగ్ టైటిల్ గా ప్రకటించారు. అయితే అసలు టైటిల్ ఇదే ఉంటుందా ? మారుతుందా అన్నది మాత్రం సమంత నటించిన జాను చిత్రం విడుదల తర్వాతే తేలనుంది. ఇక ఈ జాన్ విషయానికి వస్తే ...... జాన్ షూటింగ్ ప్రారంభమైందని ట్వీట్ చేసాడు ప్రభాస్. తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ పిక్ ని కూడా విడుదల చేసాడు ప్రభాస్.

పెద్ద మొత్తంలో ఉన్న ఫోటోలను తదేకంగా చూస్తున్న ప్రభాస్ స్టిల్ ఫ్యాన్స్ ని అలరించేలా ఉంది. 1960 కాలంనాటి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ తో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. సాహో వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ సినిమా మళ్ళీ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందా ? అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు ఈ అప్ డేట్ సంతోషంలో ముంచేదే అని చెప్పాలి. సాహో తో దెబ్బతిన్నాడు మరి ఈ జాన్ అయినా విజయ తీరాలకు చేర్చుతుందో ? చూడాలి.