కేసీఆర్ బయోపిక్ రిలీజ్ అవుతుందా ?

Published on Apr 03,2019 04:42 PM

తెలుగునాట బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుండటంతో ఉద్యమ నాయకుడు  కేసీఆర్ బయోపిక్ తీశారు . చిత్రీకరణ కూడా పూర్తయ్యింది కూడా . కానీ రిలీజ్ మాత్రం కావడం లేదు గత సంవత్సర కాలంగా సినిమా రిలీజ్ కోసం అష్టకష్టాలు పడుతోంది కేసీఆర్ బయోపిక్ చిత్రం '' ఉద్యమ సింహం ''. తెలంగాణ ఉద్యమ కాలాన్ని , పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ ఉద్యమ సింహం అనే చిత్రాన్ని నిర్మించారు . 

అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చింది పైగా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏర్పడింది ఇలాంటి కాలంలో కేసీఆర్ బయోపిక్ రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ........ ఎన్నికలు ...... ఆంధ్రా ఓట్లు . అవును ఉద్యమ సింహం లో ఆంధ్రులపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి దాంతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా ఆంధ్రా ఓట్లు ప్రభావితం అవుతాయి కాబట్టి ఎన్నికలు అయిపోయేంత వరకు సినిమా రిలీజ్ వద్దు అని కొంతమంది ఆపేసారట ! అయితే ఎన్నికలు అయ్యాక అయినా సినిమా రిలీజ్ అవుతుందా ? హిట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .