పవన్ కళ్యాణ్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు

Published on Feb 06,2020 09:41 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇక కీలక పాత్రలో మరో హాట్ భామ అనసూయ కూడా నటిస్తోంది. కియారా అద్వానీ ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో , చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది.

దాంతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే అయ్యింది. కట్ చేస్తే మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది పవన్ కళ్యాణ్ సరసన నటిస్తూ. ఇక అనసూయ కు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని ఆశగా ఉండేది అది ఈ సినిమాతో తీరుతోంది. ఇద్దరు హాట్ భామలు పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవ్వడం ఖాయం. ఇక క్రిష్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట.