ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు దర్శకులు

Published on Dec 17,2019 03:49 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఇద్దరు దర్శకులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ చాలామంది దర్శకులు అనుకుంటారు అయితే ఇద్దరు మాత్రం ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కు కూడా ఆ ఇద్దరితో సినిమాలు చేయాలనీ ఉంది కానీ ప్రస్తుతం తన ద్రుష్టి అంతా ఆర్ ఆర్ ఆర్ మీదే ఉంది కాబట్టి వాళ్ళని వెయిట్ చేసేలా చేస్తున్నాడు. ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులు ఎవరో తెలుసా ....... తమిళ దర్శకుడు అట్లీ అలాగే కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరు దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ సినిమా కోసం కసిగా కష్టపడుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం కావడంతో ఎన్టీఆర్ చాలా కసిగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ విడుదల అయ్యాక అప్పుడు ఈ ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ కానున్నాడట ఎన్టీఆర్. ఇక అట్లీ తమిళ చిత్రం చేస్తున్నాడు అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 చేస్తున్నాడు. అవి పూర్తయ్యాక మరి ఎవరెవరి కాంబినేషన్ సెట్ అవుతుందో ?