పెళ్లి చేసుకుంటున్న టీవీ నటి

Published on Dec 27,2019 10:58 PM

టీవీ నటి మోనా సింగ్ పెళ్ళికి సిద్ధమైంది. తన స్నేహితుడైన శ్యామ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే  ఇక ఆ పెళ్లి ఈరోజే జరుగుతోంది. నిన్న పెద్ద ఎత్తున మెహందీ వేడుకలు జరిగాయి , దాంతో ఆ మెహందీ వేడుకలలో బాగా సందడి చేసారు మోనా సింగ్ - శ్యామ్. వీళ్లకు తోడు వాళ్ళ బంధుమిత్రులు కూడా ఈ వేడుకలో పాల్గొని బాగానే హడావుడి చేసారు. ఇక ఆ హడావుడికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి ఈ విషయాన్నీ బహిరంగపర్చారు.

నాటకాలతో పాటుగా , బుల్లితెర పై సంచలనం సృష్టించిన ఈ భామ వెండితెర పై కూడా పలు చిత్రాల్లో నటించింది. గతకొంత కాలంగా శ్యామ్ తో బాగా సన్నిహితంగా ఉంటున్న ఈ భామ సడెన్ గా పెళ్లి విషయాన్నీ చెప్పి షాక్ ఇచ్చింది. శ్యామ్ దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడం విశేషం. త్రీ ఇడియట్స్ చిత్రంలో కరీనా కపూర్ కు అక్కగా నటించింది మోనా సింగ్ , అలాగే తాజాగా అమీర్ ఖాన్ - కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్న '' లాల్ సింగ్ చద్దా '' చిత్రంలో కూడా నటిస్తోంది మోనా.