టీవీ నటుడు హఠాన్మరణం

Published on Dec 27,2019 04:40 PM
ముంబై టీవీ నటుడు కుషాల్ పంజాబీ ( 37) హఠాన్మరణంతో టీవీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. కేవలం 37 ఏళ్ల వయసులోనే జీవితం అర్దాంతరంగా ముగిసిపోవడంతో కుషాల్ సన్నిహితులు శోకసంద్రంలో మునిగారు. జోర్ కా జట్కా అనే రియాలిటీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు కుషాల్. టీవీ షోలలోనే కాకుండా బాలీవుడ్ లో పలు చిత్రాల్లో కూడా నటించాడు కుషాల్.

కుషాల్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. కుషాల్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అతడి తో తమకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తున్నారు కుషాల్ సన్నిహితులు. ఎప్పుడూ ఫిట్ గా ఉండే కుషాల్ హఠాత్తుగా మరణించాడన్న విషయాన్నీ జీర్ణించుకోలేక పోతున్నారు కుషాల్ స్నేహితులు. కుషాల్ కు భార్య ఒక కుమారుడు ఉన్నాడు.