రజనీకాంత్ ను కలిసిన టీఆర్ఎస్ ఎం ఎల్ ఏ

Published on Nov 07,2019 12:29 PM
రజనీకాంత్ ను కలిసిన టీఆర్ఎస్ ఎం ఎల్ ఏ

సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిసాడు టీఆర్ఎస్ ఎం ఎల్ ఏ రోహిత్ రెడ్డి. రజనీకాంత్ కు వీరాభిమాని అయిన రోహిత్ రెడ్డి గతంలో కూడా పలుమార్లు రజనీకాంత్ ని కలిసాడు. కాగా తాజాగా తమిళనాడు వెళ్లిన రోహిత్ రెడ్డి తన భార్యతో కలిసి రజనీకాంత్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి సేవ చేసి వాళ్ళ ఋణం తీర్చుకోవాలని చెప్పాడట రజనీకాంత్.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచాడు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. రజనీకాంత్ ని వ్యక్తిగంతంగానే కలిశానని , ప్రజాసేవ చేస్తూ మంచి చేయాలనీ సలహా ఇచ్చారని పేర్కొన్నాడు రోహిత్ రెడ్డి.