ఆ హీరోయిని వెంటపడుతున్న త్రివిక్రమ్

Published on Feb 21,2020 04:07 PM

దర్శకులు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డే వెంట పడుతున్నాడు. ఇప్పటికే అరవింద సమేత చిత్రంలో తన దర్శకత్వంలో నటించగా మళ్ళీ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల .... వైకుంఠపురములో చిత్రంలో కూడా పూజా హెగ్డే ని రిపీట్ చేసాడు కట్ చేస్తే అల ..... వైకుంఠపురములో కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ తో మళ్ళీ చేయబోయే సినిమాలో కూడా పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. దాంతో త్రివిక్రమ్ ఆ హీరోయిన్ ని వదిలేలా లేడులే ! అని అంటున్నారు.

తాజాగా ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మళ్ళీ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనుంది. '' అయిననూ పోయిరావలె హస్తినకు '' అనే టైటిల్ ని ఖరారు చేసారట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ - పూజా హెగ్డే జోడీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది, కాబట్టి మళ్ళీ అలరించడం ఖాయమే !