త్రివిక్రమ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ తో

Published on Jan 02,2020 06:32 PM

పవన్ కళ్యాణ్ తో మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయనున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇందుకు కారణం ఏంటో తెలుసా ..... తాజాగా దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని కలవడమే ! ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు జల్సా , అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి చిత్రాలు వచ్చాయి. అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ కాగా జల్సా , అత్తారింటికి దారేది చిత్రాలు మాత్రం బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అయితే మూడో చిత్రంగా విడుదలైన అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రావాలని ఆశపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.

జనసేన కార్యక్రమాలతో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో లాయర్ సాబ్ గా రీమేక్ చేస్తున్నారు. కాగా లాయర్ సాబ్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ - పవన్ ల కాంబినేషన్ లో కూడా సినిమా వస్తే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు. పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ కలిసింది సినిమా కోసమేనా ? లేక ఫ్రెండ్ షిప్ అని కలిశాడా ? అన్నది తేలాల్సి ఉంది. పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ దర్శకత్వంలో కూడా మరో చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్.