అల్లు అర్జున్ సీక్రెట్ ని బయట పెట్టిన త్రిష

Published on Mar 30,2020 10:59 PM
హీరోయిన్ త్రిష అల్లు అర్జున్ సీక్రెట్ ని బయటపెట్టేసింది. ఇంకేముంది అది క్షణాల్లో పాకిపోయింది. ఇంతకీ ఆలు అర్జున్ సీక్రెట్ ఏంటి ? త్రిష బయట పెట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా. సోషల్ మీడియాలో చాలామందికి అకౌంట్ లు ఉంటాయి అయితే అందులో కొన్ని మాత్రమే బయట పెడుతుంటారు మిగతావి సీక్రెట్ గా తమకు అవసరమైన వాళ్లకు మాత్రమే తెలిసేలా చేస్తుంటారు. అలాంటి సీక్రెట్ అకౌంట్ ని బయటపెట్టేసింది త్రిష.

అల్లు అర్జున్ bunny _boy _private అనే అకౌంట్ చాలా పర్సనల్ గా వాడుతుంటాడు. ఈ అకౌంట్ గురించి పలువురు సెలబ్రిటీలకు తప్ప మిగతా వాళ్లకు తెలియదు కానీ అల్లు అర్జున్ ఈ అకౌంట్ వాడతారు అని బహిరంగం చేసేసింది త్రిష. ఆ అకౌంట్ నుండి త్రిష తో చాట్ చేయడంతో దాన్ని బయట పెట్టేసింది ఈ భామ. ఇటీవలే 96 రీమేక్ తో తమిళంలో సంచలనం సృష్టించిన ఈ భామ చిరు సరసన నటించే ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.