చిరంజీవి సినిమా నుండి తప్పుకున్న త్రిష

Published on Mar 15,2020 02:48 PM
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ  హీరోయిన్ త్రిష మాత్రం చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తాజాగా ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా త్రిష ని ఎంచుకున్నారు. ఇక త్రిష కూడా సంతోషంగా అంగీకరించింది. కట్ చేస్తే షూటింగ్ కూడా కొంత అయ్యింది. కానీ లొకేషన్ లో చేస్తున్న సన్నివేశాలకు తనకు చెప్పిన సన్నివేశాలకు పొంతన లేకపోవడంతో దర్శకుడ్ని నిలదీసిందట.

దాంతో దర్శకుడు ఇచ్చిన వివరణ త్రిషకు నచ్చకపోవడంతో ఇలాంటి పాత్రల్లో నేను నటించను సారీ అంటూ ఆచార్య నుండి వైదొలిగిందట. అంతేకాదు ఈ విషయాన్నీ సోషల్ మీడియా సాక్షిగా తెలియజేసింది ఆచార్య నుండి తప్పుకున్నట్లుగా. దాంతో షాక్ అయిన చిత్ర బృందం మరో హీరోయిన్ ని పట్టుకునే పనిలో పడ్డారట.