చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తున్నారట విజయ్ దేవరకొండని

Published on Apr 25,2020 08:04 AM
నన్ను చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తున్నారు మా అమ్మానాన్న అందుకే మీ ఛాలెంజ్ ని స్వీకరించడం లేదు సార్ అంటూ ట్వీట్ చేసాడు హీరో విజయ్ దేవరకొండ. దర్శకులు కొరటాల శివ బి ది రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ లో భాగంగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు ఛాలెంజ్ విసిరాడు. దానికి స్పందించిన విజయ్ దేవరకొండ ఇంట్లో పనులు చేస్తానని అమ్మతో చెప్పాడట అయితే వాళ్ళ అమ్మ మాత్రం నువ్ పనిచేయొద్దు అనవసరంగా డబుల్ పనులు చేయాల్సి వస్తుంది. నేను ఎక్స్ట్రా గా కష్టపడాల్సి వస్తుందని ఖరాకండిగా చెప్పిందట.

దాంతో నేను మీ ఛాలెంజ్ ని చేయలేను కానీ నాదైన పని చేస్తానని మాత్రం ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ. కరోనా ఎఫెక్ట్ తో తెలుగు సినిమారంగంలో ఛాలెంజ్ ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ఛాలెంజ్ లో భాగంగా తన స్టైల్ లో పని చేస్తానని మాటిచ్చాడు ఈ క్రేజీ హీరో. మరి ఆ పని ఏంటో అన్నది చూడాలి. తాజాగా ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.