ట్రైలర్ చాలా హాట్ గురూ !

Published on Nov 28,2019 03:20 PM

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా '' ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ '' అనే చిత్ర ట్రైలర్ ని విడుదల చేసాడు. ఆ ట్రైలర్ లో యాక్షన్ తో పాటుగా రొమాంటిక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. పూజా భలేకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చైనా వాళ్లతో కలిసి పెద్ద లెవల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.

ఇక నిన్న సాయంత్రం విడుదలైన ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ ట్రైలర్ కుర్రాళ్లని ఆకట్టుకునేలా ఉంది. పూజా భలేకర్ అందాలు మరింతగా కవ్వించేలా చిత్రీకరించాడు వర్మ. యాక్షన్ దృశ్యాల్లో మాత్రమే కాకుండా రొమాంటిక్ దృశ్యాల్లో కూడా పూజా అందాలు యువతని పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ తో ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నాయి.