ఎడారిలో చిక్కుకున్న టాప్ హీరో !

Published on Apr 02,2020 04:01 PM
మలయాళ టాప్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ జోర్దాన్ ఎడారిలో చిక్కుకున్నాడు. ఆడు జీవితం అనే మలయాళ సినిమా షూటింగ్ కోసం 58 మందితో కూడిన చిత్ర బృందం జోర్దాన్ ఎడారికి వెళ్ళింది. ఏప్రిల్ 10 వరకు అక్కడ షూటింగ్ చేసుకునే అనుమతి ఉండటంతో షూటింగ్ చేసుకుంటున్నారు. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుండటంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేసారు.

అయితే అధికారుల మాటలు వినకుండా కరోనా అంత ఎఫెక్ట్ లేదను భ్రమపడి అక్కడే ఉన్నారట ! ఈలోపు కరోనా మహమ్మారి ఎక్కువై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకేముంది జోర్దాన్ ఎడారిలోనే చిక్కిపోయారు మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ అలాగే మిగతా యూనిట్ సిబ్బంది. ఈ చిత్రానికి దర్శకుడు బ్లేస్సీ. ఆ దర్శకుడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు దండం పెట్టి మమ్మల్ని కాపాడండి అంటూ వేడుకుంటున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో ? ఏంటో ?