మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన శివాజీరాజా ప్యాన‌ల్‌

Published on Mar 05,2019 06:06 PM

మా ఎల‌క్ష‌న్స్ సంద‌ర్భంగా శివాజీరాజా, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, బెన‌ర్జీ, ఎస్వీకృష్ణారెడ్డి, నాగినీడు, ఉత్తేజ్‌, ఏడిద శ్రీరామ్‌, త‌నీష్‌, సురేష్ కొండేటి, వెంక‌ట‌గోవింద‌రావు, అనిత చౌద‌రి, ర‌వీంద్ర‌, భూపాల్‌, రఘుబాబు త‌దిత‌రులు మెగాస్టార్ చిరంజీవి గారిని సోమ‌వారం ఉదయం 10గంట‌ల‌కు క‌లిశారు. సినీ ప‌రిశ్ర‌మ శ్రేయ‌స్సు కొర‌కు ఏర్ప‌డ్డ మా అసోసియేష‌న్ ద్వారా న‌టీన‌టుల‌కు మంచి జ‌ర‌గాల‌ని కోరుకునే వాళ్ళ‌లో మొద‌ట‌గా ఉంటాను. ఎల‌క్ష‌న్స్ అనే పోటీలో ఎవ‌రు నెగ్గార‌న్న‌ది ముఖ్యం కాదు. గెలిచిన టీమ్ నిస్సా్వ‌ర్థంగా సేవ చేయాల‌ని మా అభివృద్ధి కోసం ప‌నిచేయాల‌ని చిరంజీవిగారు త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చిరంజీవిగారు చెప్పిన మాటకు మ‌న‌సా, వాచా, క‌ర్మ‌ణా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని శివాజీరాజాతో పాటు ప్యాన‌ల్ స‌భ్యులు తెలిపారు.