జార్జ్ రెడ్డి ని చూసి థ్రిల్ అయ్యాడట

Published on Nov 19,2019 02:34 PM

సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి గా నటించిన చిత్రం '' జార్జ్ రెడ్డి ''. 1968- 72 మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రకంపనలు సృష్టించిన స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ గేటు ముందే అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. అదే కథాంశానికి కమర్షియల్ హంగులు కలగలిపి రూపొందించిన ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేశారు. అందులో దర్శకులు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నాడు.

జార్జ్ రెడ్డి చిత్రాన్ని చూసిన వర్మ పొగడ్తల వర్షం కురిపించాడు. సందీప్ తన నటనతో జార్జ్ రెడ్డి ని గుర్తు చేసాడని , సినిమా అద్భుతంగా ఉందని ...... జార్జ్ రెడ్డి ని చూసి చాలా థ్రిల్ యూ గురయ్యానని ట్వీట్ చేసాడు దర్శకులు రాంగోపాల్ వర్మ. ట్రైలర్ తో జార్జ్ రెడ్డి చిత్రంపై అంచనాలు పెరిగాయి దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా జార్జ్ రెడ్డి చిత్రానికి మద్దతుగా నిలవడంతో మంచి విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర బృందం.