19న పోటీ పడుతున్న మూడు సినిమాలు

Published on Apr 17,2019 04:51 PM

ఈనెల 19 న మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి . ఒకటేమో నాని నటించిన జెర్సీ కాగా మరొకటి హిట్ చిత్రాల సిరీస్ లలో వస్తున్న హర్రర్ చిత్రం కాంచన 3 . ఇక వీటికి పోటీ కాదు కానీ అదే రోజున 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది . 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ చిత్రంలో హాట్ భామ ఓవియా నటించిన విషయం తెలిసిందే . 

తమిళనాట 17 కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించిన 90 ఎం ఎల్ చిత్రాన్ని తెలుగులో 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ పేరుతో రిలీజ్ చేస్తున్నారు . ఈ సినిమాని పక్కన పెడితే నాని - లారెన్స్ పోటీ మాత్రం తీవ్రంగానే ఉండటం ఖాయం ఎందుకంటే కాంచన సిరీస్ లో వచ్చిన మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి దాంతో ఈ సినిమాని తక్కువగా అంచనా వేయలేం . నాని కి పోటీ లారెన్స్ తోనే . అయితే నాని చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుందట దాంతో జెర్సీ , కాంచన 3 , 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి .