ఉగాదికి మూడు సినిమాల పోటీ

Published on Mar 10,2020 11:52 AM
ఈనెల 25 న ఉగాది పర్వదినం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మూడు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఆ మూడు చిత్రాల్లో నాని - సుధీర్ బాబు లు నటించిన'' వి ''  చిత్రం , అలాగే యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '' 30 రోజుల్లో ప్రేమించడం ఎలా '' అనే చిత్రం అలాగే రాజ్ తరుణ్ హీరోగా నటించిన '' ఒరేయ్ బుజ్జిగా '' చిత్రం కూడా విడుదల అవుతోంది. అంటే ఈ ఉగాదికి పెద్ద చిత్రాల పోటీ లేకుండా పోతోందన్న మాట.

అందులో చెప్పుకోతగ్గ సినిమా నాని - సుధీర్ బాబు లు నటించిన వి చిత్రమే ! ఈ చిత్రంలో నాని విలన్ గా నటించడం విశేషం. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా నాని కిల్లర్ గా నటించాడు. ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏంటంటే విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించడం. ఇక 30 రోజుల్లో ప్రేమించడం ఎలా , ఒరేయ్ బుజ్జిగా చిత్రాల పట్ల అంతగా సానుకూలంగా అయితే లేదు. కానీ ప్రేక్షకులను అలరించేలా ఉంటే తప్పకుండా విజయం సాధించొచ్చు. మరి ఈ మూడు చిత్రాల్లో విజయం సాధించే చిత్రం ఏదో ?