బీచ్ లో పెళ్లి చేసుకుంటుందట ఈ హాట్ భామ

Published on Apr 25,2020 08:06 AM
46 సంవత్సరాల వయసులో మళ్ళీ రెండో పెళ్ళికి సిద్దపడుతోంది హాట్ భామ మలైకా అరోరా. పైగా ఈ భామకు పెళ్లి మీద పెద్ద ప్లానే ఉంది. బీచ్ లో పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉందట మలైకాకు. వైట్ డ్రెస్ లో తానొక రాజకుమారి లాగా వయ్యారంగా నడుస్తుంటే ఆమె పక్కన చెలికత్తెల్లాగా తన స్నేహితురాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ లో అనుసరిస్తుంటే బీచ్ లో పెళ్లి చూడటానికి ఎవరికైనా సరే రెండు కళ్ళు సరిపోవు అని అంటోంది మలైకా అరోరా.

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ వయసు 32 సంవత్సరాలు మాత్రమే ! మలైకా కు అర్జున్ కు మధ్య 14 ఏళ్ల తేడా ఉంది అయినప్పటికీ రొమాన్స్ కు ఈ ఏజ్ అడ్డంకి కాలేదు. భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. అయితే చాలాకాలంగా ఈ ఇద్దరి పెళ్లి అని వినిపిస్తోంది కానీ ఇంతవరకు అయితే ఏది కూడా ఖరారు కాలేదు. కానీ పెళ్లి అంటూ చేసుకుంటే బీచ్ లో చేసుకోవాలని కళలు కంటోంది మలైకా అరోరా