ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనున్న భామ ఈమే !

Published on Nov 21,2019 10:45 PM

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ వనిత '' ఒలివియా మోరిస్ '' ని ఎంపిక చేసారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ఎన్టీఆర్ సరసన నటించే భామ కోసం చాలామందిని వెతికాడు రాజమౌళి. అయితే ఇన్నాళ్లకు సెట్ అయ్యింది ఎన్టీఆర్ కు. ఒలివియా మోరిస్ ఓ టివి సిరీస్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది దాంతో ఈ భామని ఎన్టీఆర్ సరసన నటింపజేయాలనే నిరయానికొచ్చాడు రాజమౌళి.

ఒలివియా మోరిస్ అందంగా ఉంది అంతకంటే మెరుగైన నటన ప్రదర్శించడం ఖాయమని , సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించి ఎంపిక చేశారట. ఒలివియా మోరిస్ తో పాటుగా ఈ చిత్రంలోని మరో రెండు కీలక పాత్రల్లో '' రే స్టీవెన్ సన్ '' , '' అలీ సెన్ డూడీ '' లను కూడా ఎంపిక చేసారు. ఈ ముగ్గురిని ఎంపిక చేసిన విషయాన్నీ ఈరోజు అధికారికంగా ప్రకటించారు దర్శకులు రాజమౌళి. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ సెట్ కావడంతో ఇక షూటింగ్ మరింత శరవేగంగా జరుగనుంది.