భీష్మ హిట్ కావడంతో ఆ హీరో కసితో రగిలిపోతున్నాడట

Published on Feb 22,2020 10:43 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో హీరో నాగశౌర్య రగిలిపోతున్నాడట. వెంకీ కుడుముల మొదటి చిత్రం ఛలో. ఆ చిత్రన్ని నిర్మించింది నాగశౌర్య అన్న సంగతి తెలిసిందే. నాగశౌర్య అమ్మా - నాన్నలు ఛలో చిత్రాన్ని నిర్మించారు , సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది అయితే ఆ సంతోషం కంటే ఛలో కథ నాదే అంటే లేదు నాదే అంటూ ఇగోలకు పోయారు హీరో నాగశౌర్య అలాగే దర్శకుడు వెంకీ దాంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ కెళ్ళిపోయింది.

ఇటీవలే నాగశౌర్య హీరోగా అశ్వద్ధామ అనే చిత్రంలో నటించాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఛలో కథ నాదేనని అయితే వెంకీ మాత్రం అది తన కథే అని చెప్పుకోవడమే కాకుండా క్రెడిట్ కొట్టేశాడని అలాగే కారు గిఫ్ట్ గా ఇస్తే దాన్ని వాడకుండా అమ్ముకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసాడు. కట్ చేస్తే వెంకీ రెండో చిత్రం భీష్మ రిలీజ్ అయ్యింది హిట్ అయ్యింది దాంతో ఇప్పుడు మళ్ళీ ఆ హీరోకు వెంకీ మీద ఇంకా కోపంగా ఉందట.