ప్రభాస్ అంటే పడిచచ్చిపోతున్న భామ

Published on Apr 02,2020 04:09 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పడిచచ్చిపోతోంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. నా ఫేవరేట్ హీరో ప్రభాస్ ! అతడితో కలిసి నటించే ఛాన్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అలియా భట్. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే సాహో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం హిట్ అనిపించుకుంది.

దాంతో ప్రభాస్ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్ అన్నమాట బిజినెస్ పరంగా. దాంతో అతడి సరసన నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అందమైన భామలు. ఇక ఆ కోవలోనే చేరింది అలియా భట్ కూడా. తాజాగా ఈ భామ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో చరణ్ సరసన సీతగా నటిస్తోంది. ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.