రిస్క్ చేస్తున్న హాస్య నటుడు

Published on Nov 19,2019 09:35 PM

హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి రిస్క్ తీసుకొని దర్శక నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం '' భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు ''. ఈ సినిమాలో మొత్తం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే ఉంటుందని సెంటిమెంట్ ఉండదు అలాగే యాక్షన్ కూడా లేదు అంటూ ప్రకటించారు కూడా. ఇక ఈ చిత్రంలో అందరూ హాస్య నటులే నటించడం విశేషం. అయితే ముఖ్య పాత్రల్లో శ్రీనివాసరెడ్డి , షకలక శంకర్ , వెన్నెల కిషోర్ , సత్య తదితరులు నటించారు.

కమెడియన్ గా రాణిస్తున్న శ్రీనివాసరెడ్డి హీరోగా కొన్ని చిత్రాల్లో నటించాడు అయితే అందులో ఒకటి మంచి హిట్ అయ్యింది కూడా. కానీ ఎందుకో తన మీద తనకు బాగా నమ్మకం ఎక్కువయి చేసాడో ? లేక వేరే వాళ్లపై నమ్మకం లేక కావచ్చు మొత్తానికి తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక శ్రీనివాసరెడ్డి చేస్తున్న రిస్క్ ఎంతటిది అన్నది డిసెంబర్ 6 న తేలనుంది.