సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేస్తోంది వీళ్ళే !

Published on Dec 15,2019 03:52 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అనిల్ సుంకర , మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి , ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 11 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. టీజర్ తో సంచలనం సృష్టించిన మహేష్ సినిమాతో రికార్డుల మోత మోగించడం ఖాయమని భావిస్తున్నారు.

క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పలువురు బయ్యర్లు పోటీ పడ్డారు అయితే ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినవాళ్లకు మాత్రమే సరిలేరు నీకెవ్వరు రైట్స్ లభించాయి. ఇక ఈ సినిమని ఏరియాల వారీగా విడుదల చేస్తున్న వాళ్ళ లిస్ట్ ఓసారి చూద్దామా !

నైజాం  అండ్ ఉత్తరాంధ్ర        -  శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్
రాయలసీమ                           -  సాయిచంద్ర ఫిలిమ్స్
కృష్ణా                                       -  క్రేజీ సినిమాస్
గుంటూరు                                -  పద్మాకర్ సినిమాస్
ఈస్ట్                                          -  వింటేజ్ క్రియేషన్స్
వెస్ట్                                           -  ఆదిత్య ఫిలిమ్స్
నెల్లూరు                                    -   హరి పిక్చర్స్
కర్ణాటక                                      - బృంద అసోసియేట్స్
తమిళనాడు                               -   ఎస్ ఎస్ సి మూవీస్
రెస్ట్ ఆఫ్ ఇండియా                      -   పెన్ ఇండియా
ఓవర్ సీస్                                   -  గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ అండ్ ఏ కే ఎంటర్ టైన్ మెంట్స్