విజయ్ దేవరకొండ సినిమాకు థియేటర్ల సమస్య

Published on Feb 02,2020 02:26 PM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాకు థియేటర్ల సమస్య పట్టి పీడిస్తోందట. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె ఎస్ రామారావు , వల్లభ నిర్మించిన చిత్రం ఈ వరల్డ్ ఫేమస్ లవర్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్ లు నటించారు. రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఐశ్వర్య రాజేష్ , ఇసా బెల్లె ఈ నలుగురు అందమైన భామలు విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసారు.

అయితే ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకుండాపోయింది దాంతో ఈ సినిమాకు పెద్దగా థియేటర్ లు దొరకడం లేదు. ఫిబ్రవరి 14 న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదల అవుతుండగా ఫిబ్రవరి 7 న శర్వానంద్ - సమంత నటించిన జాను చిత్రం విడుదల అవుతోంది దాంతో ఎక్కువ థియేటర్ లు ఆ సినిమాకు ఇస్తున్నారు. జాను సినిమా కోసం విజయ్ దేవరకొండకు థియేటర్ లు ఎక్కువగా ఇవ్వడం లేదు దాంతో నిర్మాత కె ఎస్ రామారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీద.