కరోనా వైరస్ తో థియేటర్లు ఖాళీ !

Published on Mar 06,2020 07:47 AM

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయపడుతోంది. కరోనా ప్రభావంతో గుంపుగా ఉండలాంటే భయపడుతున్నారు ప్రజలు. ఇక గుంపుగా ఉండటమే ఇష్టపడని వాళ్ళు సినిమా థియేటర్ లకు ఎలా వెళ్తారు దాంతో థియేటర్ లన్నీ ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ ఇబ్బంది హైదరాబాద్ , సికిందరాబాద్ లలో ఎక్కువగా ఉంది. కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి సికింద్రాబాద్ కి చెందిన వ్యక్తి కావడంతో అక్కడ భయకంపితులౌతున్నారు.

ఇక ఆ ప్రభావం హైదరాబాద్ లోని అన్ని థియేటర్ లపై పడింది. కరోనా భయంతో సినిమా హాళ్లకు వెళ్లాలంటే వణికిపోతున్నారు జనాలు. ప్రేక్షకులు లేక థియేటర్ లన్ని బోసిపోతున్నాయి పాపం. ఇక రేపు కూడా కొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ సినిమాల పరిస్థితి ఏంటో తలచుకుంటేనే భయంగా ఉందని అంటున్నారు దర్శక నిర్మాతలు. కరోనా  తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా తేలడంతో థియేటర్ లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దాంతో కలెక్షన్లు లేక వెలవెల బోతున్నాయి సినిమా హాళ్లు.