కరోనా దెబ్బకు థియేటర్ ల మూసివేత !

Published on Mar 12,2020 06:00 PM

కరోనా వైరస్ దెబ్బకు కేరళ రాష్ట్రంలోని థియేటర్ లన్నీ మూతబడ్డాయి. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది , ఇక ఇప్పటికే భారత్ లో కూడా పెద్ద ఎత్తున కరోనా బాధితులు నమోదు అవుతుండటంతో భయకంపితులైన థియేటర్ యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మార్చి 31 వరకు కేరళలోని అన్ని థియేటర్ లను మూసెయ్యాలని నిర్ణయించారు. ఆమేరకు ఈరోజు నుండి సినిమాలు ప్రదర్శించడం లేదు.

ఈ సంచలన నిర్ణయాన్ని మలయాళ చిత్ర పరిశ్రమ సమిష్టిగా తీసుకుంది. థియేటర్ లలో సినిమాలు ప్రదర్శిస్తే ఇలాంటి సమయంలో కలెక్షన్స్ అంతగా ఉండటం లేదు అలాగే కరోనా వైరస్ మరింతగా విజృంభించడం ఖాయం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా ఎఫెక్ట్ తో సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు లేక గిట్టుబాటు కావడం లేదు.