ఆ బయోపిక్ ఇప్పట్లో రాదట

Published on May 02,2020 11:34 AM
సీనియర్ నటి , దర్శకురాలు విజయనిర్మల బయోపిక్ ఇప్పట్లో రాదని , ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరగాలి కాబట్టి ఆ సినిమా రావడానికి మరో రెండు మూడేళ్లు పడుతుందని అంటున్నాడు విజయనిర్మల తనయుడు నటుడు నరేష్. కొద్దిరోజులుగా విజయనిర్మల బయోపిక్ లో కీర్తి సురేష్ నటించనున్నట్లు వార్తలు రావడంతో స్పందించాడు నరేష్. మా అమ్మ బయోపిక్ చేయాలనీ నాకు ఉంది , మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడే బయోపిక్ ఎలా ఉండాలో చెప్పింది అందుకే ఆమె కోరిక మేరకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాక అప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందని అందుకు రెండు మూడేళ్ళ సమయం పెట్టొచ్చని అంటున్నాడు నరేష్.

అలాగే అమ్మ బయోపిక్ తెరకెక్కాలంటే మా కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకోవాలి కదా ! అవన్నీ చర్చించిన తర్వాత చేస్తామని అంటున్నాడు నరేష్. తెలుగునాట మాత్రమే కాకుండా బాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో కూడా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. అందులో కొన్ని బయోపిక్ లు బ్లాక్ బస్టర్ లు కాగా మరికొన్ని మాత్రం డిజాస్టర్ అయ్యాయి అందుకే జాగ్రత్తలు తీసుకొని మరీ చేయాలనీ భావిస్తున్నాడు సీనియర్ నరేష్.