నటుడిగా సత్తా చాటిన తరుణ్ భాస్కర్

Published on Nov 01,2019 04:16 PM

పెళ్లిచూపులు చిత్రంతో సంచలన విజయం అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దాస్యం తరుణ్ భాస్కర్ తాజాగా మీకు మాత్రమే చెప్తా చిత్రంతో హీరోగా మారిన విషయం తెలిసిందే. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రానికి శమీర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ కూడా నటించడం విశేషం. తరుణ్ భాస్కర్ , అనసూయ , అభినవ్ గోమటం, వాణి భోజన్ తదితరులు తమతమ పాత్రల్లో నటించి మెప్పించి ప్రేక్షకులను నవ్వించారు. దర్శకుడిగా కొనసాగుతున్న తరుణ్ హీరోగా నటించి సత్తా చాటాడు మొత్తానికి. మీకు మాత్రమే చెప్తా చిత్రానికి హిట్ టాక్ వస్తోంది, అయితే హిట్టా ? ఫట్టా ? అన్నది పక్కన పెడితే తరుణ్ మాత్రం నటుడిగా మెప్పించాడు.