తరుణ్ భాస్కర్ తదుపరి సినిమా వెంకటేష్ తో ?

Published on Dec 10,2019 05:32 PM

పెళ్లిచూపులు చిత్రంతో సంచలనం సృష్టించిన యువ దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ తాజాగా తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ తదుపరి చిత్రంలో హీరోగా నటించేది ఎవరో తెలుసా ? సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. పెళ్లిచూపులు చిత్రంతో దర్శకుడిగా మారిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అన్న చిత్రం చేసాడు కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈలోపు హీరో విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి '' మీకు మాత్రమే చెప్తా '' అనే చిత్రాన్ని నిర్మించాడు. అది కూడా అంతగా ఆడలేదు దాంతో మళ్ళీ మెగా ఫోన్ పడుతున్నాడు తరుణ్ భాస్కర్.

హిందీలో విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది , త్వరలోనే అది పూర్తి అవుతుందని , స్క్రిప్ట్ పక్కాగా అయ్యాక వెంకటేష్ తో ఈ సినిమా చేయనున్నామని తెలిపాడు అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. పెళ్ళిచూపులు చిత్రంతో సత్తా చాటిన తరుణ్ భాస్కర్ మళ్ళీ వెంకటేష్ తో సత్తా చాటే అవకాశం ఉంది. పైగా హిందీలో హిట్ అయిన సినిమా కాబట్టి తప్పకుండా తెలుగులో కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. వెంకటేష్ ప్రస్తుతం నటించిన వెంకీ మామ ఈనెల 13 న విడుదల అవుతుండగా అసురన్ రీమేక్ లో కూడా నటించనున్నాడు. ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు.