యాంకర్ గా మారుతున్న తరుణ్ భాస్కర్

Published on Mar 10,2020 06:58 PM

పెళ్లిచూపులు డైరెక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ యాంకర్ గా మారుతున్నాడు. త్వరలోనే బుల్లితెరపై మీకు మాత్రమే చెప్తా అనే రియాలిటీ షోకు యాంకర్ గా చేయనున్నాడు తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు చిత్రంతో దర్శకుడిగా పరిచయమై సంచలనం సృష్టించిన తరుణ్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం మాత్రమే చేసాడు. అయితే నటుడిగా మాత్రం మహానటి , సమ్మోహనం , ఫలక్ నుమా దాస్ , మీకు మాత్రమే చెప్తా తదితర చిత్రాల్లో నటించాడు. అయితే హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తా ప్లాప్ అయ్యింది.

దాంతో కొంత గ్యాప్ తీసుకున్న తరుణ్ భాస్కర్ తాజాగా మీకు మాత్రమే చెప్తా అనే షోకు యాంకర్ గా మారాడు. ఈ షో ఈనెల 14 నుండి ప్రసారం కానుంది. దర్శకుడిగా కేవలం రెండు చిత్రాలు మాత్రమే చేసిన తరుణ్ త్వరలోనే సీనియర్ హీరో వెంకటేష్ తో హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మించనున్నారు.