విజయ్ దేవరకొండకు అగ్ని పరీక్ష

Published on Oct 31,2019 10:59 AM

హీరో విజయ్ దేవరకొండకు అగ్ని పరీక్ష రేపు . విజయ్ దేవరకొండ కు అగ్ని పరీక్ష ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈ క్రేజీ హీరో నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి మీకు మాత్రమే చెప్తా అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా రేపు అంటే నవంబర్ 1 న విడుదల అవుతోంది దాంతో విజయ్ దేవరకొండ చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది రేపు తేలనుంది.

తక్కువ బడ్జెట్ లోనే నిర్మించాడు పైగా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ గా విడుదల అవుతోంది కానీ హిట్ అయితే విజయ్ దేవరకొండ కు మరింత ఇమేజ్ పెరగడం ఖాయం లేదంటే మరో దెబ్బ తగలనుంది ఈ హీరోకు. ఇక తరుణ్ భాస్కర్ కూడా దర్శకుడిగా రాణిస్తున్నాడు ఈలోగా నటుడిగా మారి తప్పు చేశాడా ? లేదా ? అన్నది కూడా మీకు మాత్రమే చెప్తా సరైన జవాబు చెప్పనుంది. అలాగే ప్రేక్షకులు కూడా వీళ్ళ పట్ల తీర్పు ఇవ్వనున్నారు.