నిప్పులు చెరిగిన తెనాలి రామకృష్ణ డైరెక్టర్

Published on Nov 17,2019 08:19 AM

సందీప్ కిషన్ - హన్సిక జంటగా నటించిన తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ విడుదలైన విషయం తెలిసిందే. హాస్య చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అంతగా పాజిటివ్ రివ్యూస్ రాలేదు దాంతో రివ్యూ రైటర్ లపై నిప్పులు చెరుగుతున్నాడు. మీకేమో నచ్చలేదు సినిమా , కానీ ప్రేక్షకులకు బాగా నచ్చింది అందుకే థియేటర్ లో పగలబడి నవ్వుతున్నారు అంతేకాదు మా సినిమాని కొన్నవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సినిమా విజయంపైన.

నేనేమి గొప్ప చిత్రం చేసానని చెప్పలేదు , ఓ వినోదాత్మక చిత్రం చేసానని చెప్పాను . జనాలకు నచ్చింది కానీ మీకు నచ్చలేదు .... నచ్చనప్పుడు రాయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే సినిమాపై ఆధారపడిన ఎన్నో జీవితాలు ఉన్నాయి మరి అని ఉచిత సలహా ఇస్తున్నాడు దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి. నిజమే ఒక సినిమా తీయడానికి నిర్మాత ఎక్కడెక్కడో అప్పు తెచ్చి సినిమా నిర్మిస్తాడు, అలాగే ఆసినిమా కోసం సాంకేతిక నిపుణులు , నటీనటులు ఇలా ఎందరి జీవితాలో ఆధారపడి ఉంటాయి మరి.