అఖిల్ తో టాక్సీ వాలా హీరోయిన్

Published on Feb 27,2019 04:37 PM

అక్కినేని అఖిల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ . టాక్సీ వాలా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది ప్రియాంక జవాల్కర్ . విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ భామ మొదటి సినిమా సక్సెస్ కావడంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . ఇప్పటికే సీనియర్ హీరో రవితేజ సరసన డిస్కో రాజా చిత్రంలో నటిస్తోంది . 

కాగా అఖిల్ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో నటించడానికి అంగీకరించాడు . ఆ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . టాక్సీ వాలా చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ అఖిల్ తో సినిమా చేస్తుండటంతో ప్రియాంక తప్పకుండా చేయాల్సిన సినిమా అవుతోంది .