బాధపడుతున్న టాక్సీవాలా భామ

Published on Sep 01,2019 01:12 PM

విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా చిత్రంలో నటించి అందరి మెప్పు పొందిన భామ ప్రియాంక జవాల్కర్ తనకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదని బాధపడుతోంది. టాక్సీవాలా లాంటి మంచి హిట్ ఇచ్చినప్పటికీ ఇంకా కాలం కలిసి రావడం లేదని , అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయని బాధపడుతోంది. ఒకేరకమైన పాత్రలను ఆఫర్ చేస్తుండటంతో కొన్ని నిరాకరించిందట. 
దాంతో ఈ భామకు నో ఛాన్స్ ....... తెలుగమ్మాయి ని కావడం వల్ల ఒకరకమైన భావన ఉందేమో ! అన్న అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది తప్పకుండా మంచి ఛాన్స్ లు వస్తాయని ఆశిస్తోంది ప్రియాంక జవాల్కర్. అనంతపురం కు చెందిన ఈ అమ్మాయి టాలీవుడ్ లో స్టార్ కావాలని ఆశపడుతోంది, మరి ఆ ఛాన్స్ ఈ భామకు వస్తుందా ? చూడాలి.