టాస్క్ పూర్తిచేసిన విజయ్ దేవరకొండ

Published on Apr 25,2020 03:01 PM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తనకిచ్చిన టాస్క్ ని డిఫరెంట్ గా పూర్తిచేసాడు. కరోనా వైరస్ తో పలువురు సినీ ప్రముఖులు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంటి పనుల్లో సహాయం చేయండి అంటూ బి ది రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ మొదలైన విషయం తెలిసిందే. ఆ ఛాలెంజ్ లో భాగంగా కొరటాల శివ విజయ్ దేవరకొండని ఇంటి పనులు చేయాలనీ డిమాండ్ చేసాడు. దానికి నన్ను ఇంట్లో రియల్ మ్యాన్ గా గుర్తించడం లేదు సార్ అంటూ ట్వీట్ చేసి ఛాలెంజ్ ని చేయలేను అని చెప్పాడు.

అయితే ఆ తర్వాత నా స్టైల్ లో చేస్తాను అని చెప్పిన విజయ్ దేవరకొండ ఈరోజు తన టాస్క్ ని కంప్లీట్ చేసాడు. బెడ్ షీట్ మడతపెట్టి , మామిడికాయ ముక్కలు చేసి దాన్ని జ్యూస్ చేసి అమ్మతో పాటుగా తమ్ముడికి కూడా ఇచ్చాడు. ఇక మరో రౌడీ టాస్క్ చేసాడు ఈ హీరో అదేంటో తెలుసా ...... ఖాళీ అయిన  మద్యం బాటిళ్లలో మంచి నీళ్లు నింపి వాటిని ఫ్రిజ్ లో పెట్టాడు. నిజంగా ఇది రౌడీ మార్క్ టాస్క్ అనే చెప్పాలి.