నందమూరి హీరో కి షాక్

Published on Feb 04,2019 04:35 PM

నందమూరి తారకరత్న కు జి హెచ్ ఎం సి పెద్ద షాక్ ఇచ్చింది . హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో నిర్వహిస్తున్న కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ని కూల్చేశారు అధికారులు . దాంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది బంజారాహిల్స్ లో . ఈ విషయం హీరో తారకరత్న కు తెలియడంతో వెంటనే సంఘటనా స్థలానికి వచ్చాడు . 

అధికారులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండాపోయింది . నిబంధనలకు విరుద్దంగా రెస్టారెంట్ ని నడుపుతుండటమే కాకుండా రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలు అలాగే పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారని సొసైటీ సభ్యులు పోలీసులకు అలాగే జి హెచ్ ఎం సి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెస్టారెంట్ ని కూల్చేశారు . ఈ సంఘటన వల్ల తారకరత్న కు పెద్ద మొత్తంలోనే నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది .