అదిరిపోయే రేంజ్ లో ఉన్న తాన్హాజీ ట్రైలర్

Published on Nov 19,2019 08:20 PM

మరాఠా పోరాట యోధుడు ''తాన్హాజీ''  బయోపిక్ గా తెరకెక్కిన చిత్ర ట్రైలర్ ఈరోజు కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యింది. అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది తాన్హాజీ ది అన్ సంగ్ వారియర్  ట్రైలర్. అజయ్ దేవ్ గన్ తాన్హాజీ గా నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్య కాజోల్ కూడా నటించడం విశేషం. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ఈ '' తాన్హాజీ '' కావడం విశేషం. మరాఠా యోధుడు తాన్హాజీ ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్ గా ఉన్నాడు.

ఢిల్లీ పాలకులు మొఘల్ సామ్రాజ్యం పై సర్జికల్ స్ట్రైక్ చేసిన వీరుడిగా చరిత్రలో చిలిచాడు తాన్హాజీ. ప్రత్యర్థి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించిన ఈ చిత్రాన్ని 2020 జనవరి 10 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అద్భుతమైన పోరాట సన్నివేశాలతో తాన్హాజీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మొత్తానికి బయోపిక్ ల ట్రెండ్ బాలీవుడ్ లో బాగానే జోరుగా సాగుతోంది. పైగా బయోపిక్ లు బ్లాక్ బస్టర్ లుగా నిలుస్తున్నాయి బాలీవుడ్ లో.