250 కోట్లు వసూల్ చేసిన తన్హాజీ

Published on Feb 03,2020 06:29 PM

అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన తన్హాజీ సంచలన విజయం సాధిస్తోంది. భారీ వసూళ్ళని సాధిస్తూ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. మహారాష్ట్ర పోరాటయోధుడు శివాజీ సైన్యానికి అధ్యక్షుడు ఈ తన్హాజీ. మహారాష్ట్ర పౌరుషం చాటిచెప్పిన వీరుడి గాథగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ తో పాటుగా కాజోల్ నటించడం విశేషం. ఇక మరో విశేషం ఏంటంటే ..... విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించడం.

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 250 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇంకా చాలా చోట్ల మంచి కలెక్షన్లని సాధిస్తోంది తన్హాజీ. ఈ జోరు చూస్తుంటే తప్పకుండా 300 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తన్హాజీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. థియేట్రికల్ కలెక్షన్స్ తో పాటుగా డిజిటల్ , శాటిలైట్ , ఆడియో , డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీ లాభాలను తెచ్చిపెడుతోంది తన్హాజీ.