తమిళ హీరో గొప్ప ఔదార్యం

Published on Apr 25,2020 08:10 AM
తమిళ హీరో విజయకాంత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి సోకడంతో మరణిస్తున్న వాళ్ల అంత్యక్రియలకు తనకు చెందిన కొంత భూమిని వాడుకోమని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తమిళనాడులో ఇటీవల ఓ డాక్టర్ కరోనాతో మరణించగా అతడి అంత్యక్రియలు నిర్వహించడానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తిని తమ ప్రాంతంలో అంత్యక్రియలకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పడమే కాకుండా దాడులు కూడా చేసారు.

దాంతో చలించిపోయిన విజయకాంత్ చెన్నై సమీపంలో ఉన్న తన భూమిలో కొంతభాగాన్ని కరోనాతో మరణించిన వాళ్ళని అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని కోరాడు. కరోనాతో మరణించిన వ్యక్తి ద్వారా అక్కడున్న ప్రజలకు కరోనా సోకుతుందని అపోహ పడటం వల్లే దాడులకు పాల్పడ్డారని అలాంటి వాళ్ళ అపోహలు తొలగించాలని కోరాడు విజయకాంత్. తమిళ సినిమా రంగంలో 90 వ దశకంలో స్టార్ హీరోగా రాణించాడు విజయకాంత్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు.